తమ అభిమాన తారను కళ్ల ముందు చూసిన ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారు. అలాంటి ఒక క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఓ మహిళ విరాట్ కోహ్లీతో సెల్ఫీ తీసుకునేందుకు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె కంగారు పడుతూ కనిపించింది. ఈ క్లిప్‌ను చూసిన.. వినియోగదారులు ఒకవైపు విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూనే.. మరోవైపు, విరాట్‌తో ఇలా ప్రవర్తించవద్దని ఆ మహిళకు సలహా ఇస్తున్నారు.