కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే బిర్యానీ అని ప్రచారం చేసింది. అయితే అక్కడ నో పార్కింగ్ లో పార్కింగ్ చేసిన వెహికిల్స్ కు పోలీసులు రూ.100 జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.