విజయవాడలోనూ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది.. దీంతో.. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి... ఈ ఘటనలో ఓ ఇల్లు కూలిపోయింది.. నలుగురురికి తీవ్రగాయాలు అయినట్టు చెబుతున్నారు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని రెండు చోట్ల ఇళ్లు కూలాయి.. దీంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. రెండు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు సిబ్బంది.. శిథిలాల్లో తొమ్మిది మంది చిక్కుకోగా.. వారిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు..
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ప్రమాదం జరిగింది. జి.కొండూరులోని పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ టైర్లు పేలి వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో కలకోటి ప్రవీణ్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. వేసవిలో ఎండల కారణంగా బ్యాటరీలు వేడెక్కి ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్నాయి. దీంతో ఆయా వాహనాల జోలికి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విజయవాడ సూర్యారావు పేటలోని గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 40 శాతం గాయాలు కావడంతో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా…