Jaiswal vs Gill: టీమిండియా టెస్టు జట్టులో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇన్నింగ్స్ 92వ ఓవర్‌ను జైదెన్ సీలెస్ వేశాడు. ఆ ఓవర్ సెకండ్ బంతిని యశస్వీ జైస్వాల్ మిడాఫ్ వైపు కొట్టాడు. ఈజీగా పరుగు వస్తుందని భావించిన యశస్వి రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మరోవైపు గిల్ మాత్రం అతడి పిలుపును పట్టించుకోకపోవడంతో.. అప్పటికే సగం పిచ్‌కు పైగా దాటిన జైస్వాల్ రిటర్న్ అయ్యేలోపు రనౌట్ అయ్యాడు.