థర్డ్ వేవ్ రూపంలో ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి శాంతిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 1,07,474 కొత్త కోవిడ్-19 కేసులు 865 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం సంఖ్య 4,21,88,138కి చేరుకోగా, మృతుల సంఖ్య 5,01,979కి చేరింది. యాక్టివ్ కాసేలోడ్ 12,25,011కి పెరిగింది. ఇది ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 2.90 శాతం. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతానికి…
ఆఫ్రికాలోని బోట్స్‌వానాలో మొదటి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఈ వేరియంట్ క్రమంగా ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాలకు వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగానే ఉన్నది. మరణాల సంఖ్య సైతం తక్కువగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలు దేశాల్లో వివిధ వేవ్‌లకు ఒమిక్రాన్ కారణమైంది. తీవ్రత తక్కువగా ఉండటానికి గల కారణాలను పరిశోధకులు పరిశోధించారు. డెల్టా వేరియంట్…
ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు దేశ వ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో సైతం కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే ఇటీవలే మళ్లీ విద్యా సంస్థలను పునః ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హై కోర్టు విచారణ చేపట్టింది. విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని హై కోర్టు ఆదేశించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్…
భారత్ లో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,67,059 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, భారతదేశంలో రోజువారీ కోవిడ్-19 కేసులలో గణనీయమైన తగ్గుదల నమోదైందని ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రి మంగళవారం తెలిపారు. భారతదేశంలో సోమవారం 2,09,918 కరోనా కేసులు, 959 మరణాలు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల్లో 1,192 కొత్త మరణాలు సంభవించడంతో, దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,96,242 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ.. దక్షిణాఫ్రికా…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,35,532 కరోనా కేసులు నమోదవ్వగా, 871 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కేసులు తగ్గుతుంటే, మరణాలు పెరుగుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. కరోనా కొత్త కేసుల కంటే రికవరీ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 3,35,939 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. రోజుకవారీ కరోనా పాజిటివిటీ రేటు…
కరోనా ఎంట్రీతో అన్ని దేశాలు ఆంక్షల బాట పట్టాయి.. ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి ఎవరైనా వచ్చారంటే.. అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, క్రమంగా ఆ పరిస్థితి పోయినా.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంట్రీతో మరోసారి చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.. అయితే, ఈ సమయంలో విదేశీ ప్రయాణికులకు హాంగ్ కాంగ్ శుభవార్త చెప్పింది.. హాంగ్ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.. Read…
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ పెడుతూనే ఉంది.. ఇక, భారత్‌లో ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతోంది.. వందలు, వేలు.. లక్షలు దాటేస్తున్నాయి.. రోజువారి కేసులు.. ఈ సమయంలో.. ఊరట కలిగించే అంశాన్ని తెలిపింది ఐసీఎంఆర్ నిర్వహించిన తాజా అధ్యయనం.. ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చారు.. ఇది డెల్టాతో పాటు ఇతర కోవిడ్ వేరియెంట్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలదని ప్రకటించింది. Read Also: ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్…
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది.. కొత్త కొత్త వేరియంట్లుగా విరుచుకుపడుతూనే ఉంది.. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ.. భయాందోళనకు గురిచేస్తోంది.. రికార్డుల స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. అయితే, ఒమిక్రాన్‌పై తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.. ఒమిక్రాన్ జెట్ స్పీడ్‌తో వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి? మనిషి శరీరంపై అది ఎంత సేపు సజీవంగా ఉంటుంది..? ఇతర వస్తువులపై ఎన్ని గంటల పాటు…