ప్రపంచాన్ని ఒమిక్రాన్ కేసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత దేశంలోనూ కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. రావులపాలెం మండలం ఊబలంకలో మూడు ఒమిక్రాన్ కేసులతో అప్రమత్తం అయ్యారు అధికారులు. ఒమిక్రాన్ కేసులు నమోదైన ప్రాంతంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు పంచాయతీ సిబ్బంది. సౌదీ…