పెట్రోల్ ఖర్చులతో విసుగెత్తిపోయిన వారంతా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. పర్యావరణహితంగా ఉండడం, డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ ఏర్పడింది. కస్టమర్లను మరింత ఆకర్షించేలా టూవీలర్ ఈవీ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా అదిరిపోయే ఫీచర్లతో మూడో జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన 8 కొత్త స్కూటర్లను రిలీజ్ చేసింది. S1 Pro, S1 Pro+ సహా తక్కువ…