Ola Electric: ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్.. తక్కువ ధరలోనే
- ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల
- S1 Pro, S1 Pro+, S1X, S1X+
- ప్రారంభ ధర రూ. 79 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్ ఖర్చులతో విసుగెత్తిపోయిన వారంతా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. పర్యావరణహితంగా ఉండడం, డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ ఏర్పడింది. కస్టమర్లను మరింత ఆకర్షించేలా టూవీలర్ ఈవీ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా అదిరిపోయే ఫీచర్లతో మూడో జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన 8 కొత్త స్కూటర్లను రిలీజ్ చేసింది.
S1 Pro, S1 Pro+ సహా తక్కువ ధరల్లో S1X, S1X+ తీసుకొచ్చింది. వీటిల్లో డిఫరెంట్ బ్యాటరీ ఆప్షన్లతో మొత్తం 8 స్కూటర్లను తీసుకొచ్చింది. కస్టమర్లకు తక్కువ ధరలోనే కొత్త ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈవీ సెక్టార్ లో ఓలా ఎలక్ట్రిక్ దూసుకెళ్తోంది. రికార్డ్ సేల్స్ తో అదరగొడుతోంది. కాగా కొత్తగా రిలీజ్ అయిన ఈవీల ధరలు రూ. 79 వేల నుంచి మొదలై గరిష్టంగా రూ. 1.69 లక్షల వరకు ఉన్నాయి. S1 Pro.. 3kwh బ్యాటరీ, మరొకటి 4kwh బ్యాటరీ వేరియంట్లలో రిలీజ్ చేశారు.
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్!
S1 Pro+.. 4kwh, 5.3 kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. S1X 2,3, 4 Kwh బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. S1X+ 4Kwh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. Pro+ ఎలక్ట్రిక్ వెహికల్ సింగిల్ ఛార్జ్ తో 320 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. కొత్త స్కూటర్ శ్రేణి ‘MovOS 5’ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఇంతకుముందు, స్కూటర్లు బెల్ట్ డ్రైవ్ తో వచ్చాయి. ఇప్పుడు దాని స్థానంలో చైన్ డ్రైవ్ తీసుకొచ్చారు. ఇది కొత్త పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు, అన్ని స్కూటర్లు మిడ్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను పొందుతాయి. హబ్ మోటారుతో పోలిస్తే, ఇది నాలుగు రెట్లు ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, ఫిబ్రవరి మూడో వారం నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..