కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అధికారిక నివాసంలో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కేంద్రమంత్రి ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి ప్రజా భవన్ కి షిఫ్ట్ అవ్వనున్నారు. కాగా.. నిన్న రాత్రి ప్రజా భవన్ భట్టి విక్రమార్క పరిశీలించారు. రేపు ఉదయం 8.20కి ఆర్ధిక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత.. ప్రజా భవన్ లో అధికారిక నివాస భవనంలో ఉండనున్నారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి ప్రయత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.