వయనాడ్ బాధితుల కోసం చీటింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ భారీ సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్‌కు చంద్రశేఖర్ లేఖ రాశారు. అంతేకాకుండా బాధితులకు తక్షణ ప్రాతిపదికన 300 ఇళ్ళు నిర్మించడానికి మరింత సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుకేష్ తన లేఖలో పేర్కొన్నాడు.