Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్…
Witchcraft: ఒడిశా గజపతి జిల్లాలో క్షుద్ర విద్య, చేతబడి చేస్తు్న్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు దారుణంగా హత్య చేశారు. 35 ఏళ్ల వ్యక్తిని చంపి, అతడి ప్రైవేట్ భాగాలు ముక్కలు చేసి, సమీపంలోని హరభంగి డ్యామ్‌లో పారేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు వ్యక్తి గొంతు కోసం చంపిన తర్వాత, అతడి జననేంద్రియాలు కత్తిరించి, మృతదేహాన్ని జలాశయంలో పారేశారు. పోలీసులు డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపారు.
Odisha: ఒడిశాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణపతి జిల్లాలో ఓ ఉన్నతాధికారికి ప్యూన్ తాగునీటికి బదులుగా ‘‘మూత్రం బాటిల్’’ ఇచ్చాడు. అది తాగిన సదరు అధికారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ కేసులో ప్యూన్‌ను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామీణ నీటి సరఫారా, పారిశుధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సచిన్ గౌడకు నిందితుడైన ఫ్యూన్ సిబా నారాయణ్ నాయక్ మూత్ర బాటిల్ ఇవ్వడం సంచలనంగా మారింది.
Odisha: ఒడిశా బాలాసోర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో అసిస్టెంబ్ ప్రొఫెసర్ భార్యపై అత్యాచారయత్నం జరిగింది. అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. క్యాంపస్‌లోని ప్రొఫెసర్ అధికారిక నివాసంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Supreme Court: ఒడిశా బాలాసోర్‌లో ఉపాధ్యాయుడి నుంచి లైంగిక వేధింపులు ఎదురకావడంతో 20 ఏళ్ల బి.ఎడ్ విద్యార్థిని ఆత్మాహుతి చేసుకుని మరణించిన సంఘటనను సుప్రీంకోర్టు "సిగ్గు"గా అభివర్ణించింది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల బాలికలు, గృహిణులు, పిల్లల సాధికారత కల్పించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో సూచించాలని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం తరపు న్యాయవాది ఈ సంఘటనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత న్యాయమూర్తులు సూర్యకాంత్ , జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ…
ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కాలేజీ లెక్చరర్ వేధింపులకు తాళలేక 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం బీజేడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.
Odisha Student: తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని మృతి చెందింది. బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలకు చెందిన విద్యార్థిని భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించింది. తీవ్రమైన కాలిన గాయాలతో జూలై 12న క్యాజువల్టీకి తీసుకువచ్చారు, అక్కడే ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. కాలేజ్ ప్రొఫెసర్ నుంచి సుదీర్ఘ లైంగిక వేధింపులు ఎదుర్కొన్న విద్యార్థిని, తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య…
కనిపెంచిన తల్లిదండ్రులను కాదని.. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సామాజిక కట్టుబాట్లకు విరుద్దంగా వివాహం చేసుకున్నందుకు ప్రేమ జంటపై గ్రామస్తులు మండిపడ్డారు. ప్రియుడు, ప్రియురాలికి ఊహించని శిక్ష విధించారు. ప్రేమ జంటను ఎద్దుల మాదిరిగా నాగలికి కట్టి పొలం దున్నించారు. అంతటితో ఆగకుండా వారిని కర్రలతో కొడుతూ హించించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. నాగరిక సమాజంలో ఇలా అనాగరికంగా…
ఒడిశాలో దారుణం జరిగింది. రాజధాని భువనేశ్వర్‌లో అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు రెచ్చిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కార్యాలయంలో ఒక సీనియర్ అధికారిపై బీజేపీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఘాతుకానికి పాల్పడ్డారు.
Puri Stampede: ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. గుండిచా ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారు ప్రేమకాంత మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్ గా అధికారులు గుర్తించారు.