LAC: జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
Indian Air Force: చైనాతో కొనసాగుతున్న సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో లడఖ్‌లోని న్యోమాలో భారత్ ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించింది.