మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను గట్టిగా మందలించింది సుప్రీం కోర్ట్. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది నుపుర్ శర్మ. తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని కోర్టుకు విన్నవించింది. అయితే ఈ కేసుపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జేబీ పార్థీవాలా ఈ కేసుపై విచారిస్తూ నుపుర్ శర్మకు అక్షింతలు వేశారు.…