Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : కమలం నుంచి తిరిగి కారు వైపు చూస్తున్నారా?
ఆ మాజీ ఎమ్మెల్యే మరోసారి పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? పెట్టేబేడా సర్దుకుని మంచి ముహూర్తం, తగిన సందర్భం కోసం ఎదురు చూస్తున్నారా? లోక్‌సభ ఎన్నికల టైంలో కారు దిగేసినా…. ఇప్పుడున్న పార్టీలో ఇమడలేకపోతున్నారా? అందుకే పాత గూటికి చేరాలని తహతహలాడిపోతున్నారా? మనిషి ఒకచోట, మనసు మరోచోట అన్నట్టు ఉంటున్నారా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఏమా కథ? హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్‌లో హాట్… -
Off The Record : రెండు జాతీయ పార్టీలను అక్కడ పతంగి కలవరపెడుతుందా?
రెండు జాతీయ పార్టీలను అక్కడ పతంగి కలవర పెడుతోందా? గాలి వాటం ఎలా ఉంటుందో, ఎటువైపు ఎగిరి చైనా మాంజాలా ఎవరి గొంతుకు గాటు పడుతుందోనని ఇతర పార్టీలు కంగారు పడుతున్నాయా? ఎంఐఎం కింగ్ అవుతుందా? కింగ్ మేకర్‌గా మిగులుతుందా? ఎక్కడ ఉందా పరిస్థితి? అక్కడున్న ప్రత్యేక రాజకీయ వాతావరణం ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమే అయినా…. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకాస్త ఎక్కువ అన్నట్టు మారిపోయిందట వ్యవహారం. అందుకు… -
Off The Record : నిజామాబాద్ పరీక్షలో పీసీసీ చీఫ్ పాసవుతారా..?
తెలంగాణ మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తయితే… అక్కడ మరో ఎత్తుగా పరిస్థితి మారుతోందా? ఆ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కత్తులు దూస్తున్నాయా? ఓ సీనియర్ మంత్రికి కాంగ్రెస్ స్పెషల్‌గా బాధ్యతలు అప్పగించడం వెనక వ్యూహం ఏంటి? ఏదా మున్సిపల్ కార్పొరేషన్? ఎందుకంత స్పెషల్? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం వేసే ఎత్తుగడలు ఒక ఎత్తయితే… నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను చాలా ప్రత్యేకంగా చూస్తోందట కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. ఇది పీసీసీ చీఫ్ మహేష్… -
Off The Record : గద్వాల్ కాంగ్రెస్ లో టికెట్ల కోసం పోటాపోటీ..
ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయితీ ఎప్పటికీ ఒడవని ముచ్చటేనా? మున్సిపల్ ఎన్నికల వేళ ఇద్దరు నేతల మధ్య వార్డుల వాటా వ్యవహారం మొదటికే మోసం తెస్తుందా? తగ్గేదేలే అంటున్న రెండు వర్గాలు ఏం చేయబోతున్నాయి? ఎక్కడ జరుగుతోందా పోట్ల గిత్తల పోరు? ఆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలనుకుంటోంది? మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల్ నియోజకవర్గ రాజకీయం రసత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు అంశం వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,… -
Off The Record : మెదక్ జిల్లాలో బీజేపీకి అభ్యర్థుల కరువు
ఆ జిల్లాలో బీజేపీకి బడా నేతలున్నా….మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు కరవయ్యారా..? రా… రమ్మని పిలుస్తున్నా ఎవ్వరూ అటువైపు చూడ్డం లేదా? అందుకే పక్క పార్టీల్లో అసంతృప్తులవైపు చూస్తున్నారా? ఎక్కడ జరుగుతోందలా? కాషాయ పార్టీకి ఎందుకా కష్టం వచ్చింది? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి ఒక ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచారు రఘునందన్ రావు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి పార్టీ తరపున విజయం సాధించారు. దీంతో… -
Off The Record : రాజ్యసభ రేస్‌లో దింపుడు కల్లం ఆశలు?
జీవిత కాలపు కోరిక నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆ టీడీపీ సీనియర్ భావిస్తున్నారా? అంత సీన్ లేదని అర్ధమవుతున్నా…. అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్టుగా దింపుడు కల్లం ఆశలతో ట్రయల్స్ వేస్తున్నారా? అందుకే సీఎం చంద్రబాబు ముఖం చూడ్డానికి ఇష్టపడలేదా? ఒక్క ఛాన్స్… ఇంకొకే ఒక్క ఛాన్స్ అంటూ డిఫరెంట్‌గా నిరసన తెలుపుతున్న ఆ ఎక్స్ మినిస్టర్ ఎవరు? ఏంటా వ్యవహారం? టీడీపీ ఆవిర్భావం నుంచి మరో పార్టీ జెండా తెలియని నాయకుడు యనమల… -
Off The Record : నంద్యాల కేంద్రంగా భూమా ఫ్యామిలీ పొలిటికల్ గేమ్?
ఆ పొలిటికల్ ఫ్యామిలీ పోగొట్టుకున్నచోటే వెదుకులాట మొదలుపెట్టిందా? పాల కేంద్రంలో రచ్చ రాజకీయం కూడా అందులో భాగమేనా? అక్కా తమ్ముళ్ళు డైరీమే సవాల్ అంటున్నది కూడా అందుకేనా? ఏదా రాజకీయ కుటుంబం? ఏంటా పాల పాలిటిక్స్? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పొలిటికల్‌గా ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. అదే సమయంలో ఈ సెగ్మెంట్ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది భూమా కుటుంబం. ప్రస్తుతం ఇక్కడ భూమా అఖిలప్రియ సిట్టింగ్ ఎమ్మెల్యే. అంత వరకు బాగానే… -
Off The Record : త్వరలోనే జగన్ దగ్గర పంచాయితీ పెట్టాలనుకుంటున్నారా?
వాడుకోండి…. నా సేవల్ని బాగా ఉపయోగించుకోండి…. నా అనుభవాన్నంతా రంగరించి పార్టీని పైకి తెస్తానని ఆ వైసీపీ ఎంపీ చెబుతున్నా అస్సలు రెస్పాన్స్ ఉండటం లేదట. నువ్వు ఉండవయ్యా బాబూ…. అవసరమైనప్పుడు వాడతాంలే. టైమ్ వచ్చినప్పుడు మా వాడకం మామూలుగా ఉండదని అంటున్నా ఆ ఎంపీ మాత్రం అస్సలు తగ్గడం లేదట. హిట్ మీ హార్డ్ యార్ అంటున్న ఆ రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఏంటా కథ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పొలిటికల్ రాశి,… -
Off The Record : మంత్రి మొండి పట్టుపై పాత టీడీపీ కేడర్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మీద సొంత కేడరే అసంతృప్తిగా ఉందా? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారంటూ పార్టీలోని ఓ వర్గం రగిలిపోతోందా? చెప్పి వెళ్ళాలి, చెప్పులేసుకుని వెళ్ళాలంటూ మినిస్టర్ పెడుతున్న కండిషన్స్ వాళ్ళకు మింగుడు పడ్డం లేదా? పైగా… పబ్లిక్‌లో పరువు తీస్తున్నారంటూ ఫైరవుతున్నారా? ఇంతకీ ఏ విషయంలో నారాయణకు, కేడర్‌కు మధ్య గ్యాప్ వచ్చింది? కార్యకర్తల అసంతృప్తికి కారణాలేంటి? ఏపీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ మీద సింహపురి టీడీపీ కేరడ్ తీవ్ర అసంతృప్తితో ఉందట.… -
Off The Record : మీ ఊరా, మా ఊరా…? రా… తేల్చుకుందాం అంటూ సవాళ్ళు
సంక్రాంతి సీజన్లో కోడి పందేలకంటే ఎక్కువగా…. ఆ ఇద్దరు నేతల మధ్య పగలు రగులుతున్నాయా? నీ నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పమని ఒకరు సవాల్ చేస్తే… మరి నీ సంగతేంటంటూ మరొకరు రివర్స్‌లో వేలు చూపిస్తున్నారు. పందెం కోళ్లలా కాలు దువ్వుతున్న ఆ మహిళా నేతలు ఎవరు? ఎక్కడ పేలుతున్నాయి ఆ మాటల తూటాలు? రాయలసీమలో పొలిటికల్ పౌరుషాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి,…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!