రాజకీయాల్లో ఒక స్టేజ్‌కు వచ్చాక.. వారసులను బరిలో దించాలని చూస్తారు నాయకులు. ఒక్కరే కొడుకో.. కూతురో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ మంది సంతానం ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక్కరే పోటీ చేస్తారు. అలాంటి సమయంలోనూ పెద్దగా ఇక్కట్లు ఎదురు కాబోవు. కానీ.. ఇంట్లో ఉన్న వారసులంతా పోటీ చేస్తామని భీష్మిస్తే..! వారసులతోపాటు తండ్రి కూడా పోటీ చేస్తానని మొండి కేస్తే..! ఇంటిలోనే రాజకీయ రసకందాయంలో పడటం ఖాయం. మంత్రి విశ్వరూప్ సైతం ఇదే ఇరకాటంలోనే పడ్డారట.…