గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్‌వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది.