మేషం: లౌక్యంగా వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. శ్రీమతితో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, లోన్లు మంజూరవుతాయి. వృషభం: చేతి వృత్తుల వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో మెళుకువ అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబసభ్యులు మసలుకుంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బకాయిల…