మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. బంధు మిత్రులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. వృషభం : ఈ రోజు మీకు ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటాయి. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి.…