మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగ వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. ఆప్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో బాగా ఆలోచించి…