మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు దూకుడు తగదు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభించదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి ఇంటికి బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు. గృహోపకరణాలు…