మేషం: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పాత రుణాలు తీర్చగలుగుతారు. వృషభం: చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిథునం: చేపట్టిన పనులు మందకొడిగా…