ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్టీఆర్ పేరు.. ఎన్టీఆర్ ఊరు అనే కాన్సెప్ట్‌తో వైసీపీ అడుగులు పడుతున్నాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. తాజాగా నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్NTR.. కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్‌ను ఎవరికి వారు ఓన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.…