ఓ వైపు భయంకరమైన మృగాలు.. మరో వైపు తుఫాన్‌లా ఎగిసిపడుతున్న అలలు.. ఈ రెండింటి మధ్యన రక్తం చిందిస్తున్న కత్తి… ఆ కత్తి చివరన భయానికే భయం పుట్టించేలా ఉన్నాడు దేవర. ఇప్పటి వరకు చరిత్రలో తీర ప్రాంతాల్లో ఎప్పుడు జరగనటువంటి యుధ్దం జరుగుతోంది. సముద్ర వీరుడికి, మృగాలకు జరిగిన భీకర పోరుకు సంద్రం ఎరుపెక్కింది. తెగిపడిన తలలతో తెప్పలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు ఇలాంటి యుధ్దం ఇప్పటి వరకు స్క్రీన్ పై చూసి ఉండరు అనేలా…