స్వర్గీయ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడే కాదు..తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానేత. నటుడుగా, రాజకీయ నాయకుడుగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవితాంతం పట్టుదల, క్రమశిక్షణతో జీవించారు. ఎన్టీయార్ ప్రవేశంతో తెలుగు సినీ చరిత్ర గతి మారింది. ఆయన పొలిటికల్ ఎంట్రీ తెలుగు నేల మీద రాజకీయ గతిని మార్చింది. సినీ కళాకారుడుగా ఎన్టీ రామారావు చేయని పాత్ర లేదు. పౌరాణిక, జానపథ పాత్రల స్పెషలిస్ట్. రాముడు, కృష్ణుడి వేశం ఆయన మాత్రమే…