టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా సీరియస్ గాయాలు ఏమీ కాదని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఒక అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఇంజురీ జరిగిందని చెప్పుకొచ్చారు.…