కిడ్నీ రాకెట్ కేసులో వాస్తవాలు వెలుగు వస్తున్నాయి. దీంతో.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తుంది. కిడ్నీ మార్పిడి కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కీలక పాత్ర పోషించింది. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద పది లక్షలు వసులు చేసి.. డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించింది. మొత్తం రూ. 27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో.. మోసపోయామని తెలుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ED Raids: గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి.. 27 గంటలపాటు సోదాలు, విచారణ సాగింది.. ఈడీ రైడ్స్‌లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్నారు.. మూడు బ్యాగుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారు అధికాలరు.. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో జరిపిన సోదాల్లో కీలక ఆధారాలను రాబట్టింది ఈడీ.. నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఆర్ధిక లావాదేవీల వివరాలను డాక్యుమెంట్లతో సహా స్వాధీనం చేసుకున్నారు.. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ నుంచి సుమారు రూ. 25 కోట్ల మేర నిధులు పక్కదారి…