NPS Vatsalya Yojana: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ఎన్‌పిఎస్ వాత్సల్య యోజనను ప్రారంభించనున్నారు. దీనిని 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలోని పిల్లలందరికీ బలమైన ఆర్థిక పునాదిని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రితో పాటు పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్‌పీఎస్ వాత్సల్యలో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు పథకం గురించిన సమాచారాన్ని అందించే పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు.…