నవంబర్ మొదటి రెండు వారాలు కలిపి దాదాపు పది తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఒక్క మూడో వారంలోనే పది సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం విశేషం. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండే పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మరో రెండు నెలల పాటు తమకు థియేటర్లు దొరకవేమోననే ఆందోళనలో చిన్న చిత్రాల నిర్మాతలు ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ తో పాటు జనవరిలోనూ అగ్ర కథానాయకుల చిత్రాలు మూడు పండగ బరిలో నిలుస్తున్నాయి.…