మేఘాలయలోని షిల్లాంగ్ జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ఎనిమిదేళ్ల ఈశాన్య భారత్‌లో అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అవినీతి, అశాంతి, రాజకీయ అనుకూలత వంటి అన్ని అడ్డంకులకు తమ ప్రభుత్వం రెడ్ కార్డ్ ఇచ్చిందన్నారు.
PM To Visit Poll-Bound Tripura, Meghalaya Today: త్వరలో ఎన్నికలు జరగబోయే త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ. 6,800 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. హౌసింగ్, రోడ్లు, వ్యవసాయం, టెలికాం, ఐటీ, టూరిజం రంగాల్లో అనేక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొని, షిల్లాంగ్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.