తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయోధ్య రామమందిరం 5వందల ఏళ్ల కల, ఆ రోజున మీ భావోద్వేగం ఎలా ఉంది..? అనే ప్రశ్నకు ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘మీరు నా భావోద్వేగానికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఓ రోజు ట్రస్టీలు నా దగ్గరకు వచ్చారు. అంతటి మహత్కార్యానికి సాక్షీభూతంగా నిలవడాన్ని నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నేను నా పరిచయస్తులతో దీనిపై చర్చించాను. ఇది 5వందల ఏళ్ల…