సందర్శకులతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వాతావరణం సందడిగా మారింది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షల అమలుతో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు నగరవాసులు.. నో ట్రాఫిక్ జోన్ అమల్లోకి రావడంతో హుస్సేన్ సాగర్ కొత్తగా కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు వున్నాయి. రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో ఫ్యామిలీ & పిల్లలతో ట్యాంక్ బండ్ కళకళలాడుతోంది. ట్యాంక్ బండ్ మీద…