రాష్ట్రంలో ఆడబిడ్డలపై కొనసాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ బిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసింది పాలక పక్షం.. మహిళా కమిషన్ – రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.