గత మూడు నెలలుగా హుజూరాబాద్‌లో ప్రచార హోరు లేని రోజు. ప్రధాన పార్టీల సందడే సండది. అయితే ఉన్నట్టుండి నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సడన్‌గా నియోజకవర్గాన్ని వీడారు. అక్కడి వీధులు..సందులు ..గొందుల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఇక్కడ ప్రచారం చేస్తోన్న బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నియోజకవర్గం దాటి వెళ్లటమే ఈ సైలెన్స్‌కు కారణం. అప్పటి వరకు అక్కడి రోడ్ల మీద హల్ చల్ చేసిన…