శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ ప్రజలకు నిత్యావసరాలు అందించలేని పరిస్థితుల్లో ఉంది. మరోవైపు శ్రీలంకలో ఇంధన సంక్షోభం ముదురుతోంది. దేశ వ్యాప్తంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ఇంధన శాఖ, విద్యుత్ మంత్రి కాంచన విజేశేఖర కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ కు విదేశీ మారక నిల్వలు చెల్లించే పరిస్థితి కూడా లేదని విజేశేఖర వెల్లడించారు. తమ జలాల్లో రెండు నెలల పాటు లంగర్ వేసి ఉన్న…