మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్‌నర్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆమె అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చందన్ నగర్ ప్రాంతంలో గోనె సంచిలో 57 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నందిని శర్మ తెలిపారు.
ఓ వైపు కన్నబిడ్డ చనిపోయినందుకు బాధ.. మరో వైపు కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు డబ్బుల్లేని దీనస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితిలో ఓ తండ్రికి మరో మార్గం కనిపించక.. తన కుమారుడి మృతదేహాన్ని సంచిలో పెట్టుకుని బస్సులో దాదాపు 200 కిమీ ప్రయాణించాడు. ఈ హృదయవిదారక ఘటన పశ్చిమ బెంగాల్ జరిగింది.