Nizamabad Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తప్పనిసరిగా మున్సిపాలిటీకి ఎలాంటి బకాయిలు లేవని తెలిపే ‘నో డ్యూ సర్టిఫికెట్’ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మున్సిపాలిటీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, కుళాయి పన్ను బకాయిలు ఇప్పుడు వసూలవుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అభ్యర్థులు సుమారు 25 లక్షల రూపాయల మేర పాత…