Laughing Gas: నైట్రస్ ఆక్సైడ్ సాధారణంగా "లాఫింగ్ గ్యాస్"గా పిలుస్తుంటారు. దీనిపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది. వినోద కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్న దీన్ని బుధవారం నుంచి నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ డ్రగ్‌ని ఉత్పత్తి చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ గ్యాస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.