ప్రముఖ బుల్లితెర నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందారు. గురువారం ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని అతని సహనటులు సుదీప్ సాహిర్, సయంతని ఘోష్, విభూతి ఠాకూర్ ధ్రువీకరించారు. నితిన్ మరణ వార్త తెలిసిన వెంటనే నటి విభూతి ఠాకూర్ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. చిన్న వయసులోనే నితిన్ చనిపోయిన విషయాన్ని తోటీ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. నితిన్ చౌహాన్ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ నివాసి. సినిమాలపై ఉన్న ఇష్టంతో గత కొన్నేళ్లుగా…