యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి”. ఈ చిత్రం 21 మే 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను నిర్వాణ సినిమాస్ సొంతం చేసుకుంది. అయితే ఈ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయని తెలియలేదు. కాగా ఈ కరోనా నేపథ్యంలో ఇంకా థియేటర్స్ రీఓపెన్ కాలేదు.…