ప్రేమించుకున్నారు.. కలిసి నడుద్దాం అనుకున్నారు.. ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.. నీకు నేను.. నాకు నువ్వు అనుకున్నారు.. ఈ ఇద్దరి ప్రేమకు ఆ రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి.. ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగంలో చేరారు.. అయితే, వారి ప్రేమను మృత్యువు కూడా విడదీయలేదు.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన పేలుడు ఘటన చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపగా.. మృతదేహాలకు పఠాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేశారు వైద్యులు