అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడుగా చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్… నిజానికి ప్రముఖ నిర్మాత ఎ.వి. సుబ్బారావు మనవడు కూడా. ఆ రకంగా అటు తండ్రి, ఇటు తల్లి నుండి అతనికి సినిమా రంగంతో గాఢానుబంధమే ఉంది. తొలి చిత్రాల సంగతి ఎలా ఉన్నా, ఆ మధ్య వచ్చిన ‘చి.ల.సౌ.’ చిత్రం డీసెంట్ హిట్ అయ్యి, సుశాంత్ కు నటుడిగా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా…