Hardeep Singh Nijjar: ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. హత్య జరిగిన 9 నెలల తర్వాత ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సీబీసీ న్యూస్ నివేదించింది. 2020లో భారత్ చేత టెర్రరిస్టుగా గుర్తించబడిన నిజ్జర్, జూన్ 18, 2023న గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్య చేయబడ్డాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా నుంచి బయటకు వస్తున్న…