దక్షిణాదిన సినిమాలను ప్యాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రూపొందించటంలో దర్శకనిర్మాతలు నిమగ్నమై ఉన్నారు. ‘బాహుబలి’, ‘కెజిఎఫ్’ సీరీస్ ఘన విజయంతో అందరి దృష్టి దక్షిణాది సినిమాలపై పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సినిమాలు పరాజయాల బాట పడటంతో పాటు మన సినిమాలకు అపూర్వ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దర్శకులు కూడా భిన్నమైన కాంబినేషన్స్ కు ట్రై చేస్తున్నారు. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలసి నటించటం……