ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక మార్పులకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలో కీలక సభ్యులై డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ లను వారి పదవుల నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బౌలింగ్ కోచం ఆడమ్ గ్రిఫ్ఫిత్ ను మాత్రం జట్టుతోనే ఉంచుకునేందుకు బెంగళూరు టీమ్ యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.