క్రికెట్ చరిత్రలో అప్పుడప్పుడు చెత్త రికార్డులు నమోదవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. హేమాహేమీలు ఎన్నోసార్లు తడబడటం, పెద్ద పెద్ద జట్లు కూడా కొన్నిసార్లు పేలవ ప్రదర్శనతో నిరాశపర్చడం లాంటివి క్రికెట్ హిస్టరీలో ఎన్నో సందర్భాలున్నాయి. అయితే, తాజాగా నమోదైన రికార్డ్ మాత్రం అత్యంత చెత్తది. అసలు ఇలాంటి రికార్డ్ నమోదు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతకీ అదేంటి? అని అనుకుంటున్నారా! పదండి, మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం! శనివారం నేపాల్ మహిళల జట్టు, యునైటెడ్ అరబ్…