Nepal: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి శుక్రవారం దేశ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. నేపాల్ సార్వభౌమాధికారంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. ఇటీవల, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనలు హింసకు దారి తీశాయి. భద్రతా బలగాలు జరిపిన దాడుల్లో 51 మంది మరణించారు.