పసికూన నేపాల్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఆడే దేశంపై మొదటిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను నేపాల్ గెలుచుకుంది. సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడంతో ఈ రికార్డు నెలకొల్పింది. రెండో టీ20లో వెస్టిండీస్‌ను 83 పరుగులకే ఆలౌట్ చేసి.. 90 పరుగుల తేడాతో గెలిచింది. మొదటి టీ20లో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. నామమాత్రమేనా మూడో మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ సిరీస్ విజయం నేపాల్‌కు ఎంతో…