Breaking News: సోషల్ మీడియా బ్యాన్‌తో నేపాల్‌లో ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. జెన్ జెడ్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలి నివాసంతో పాటు అధ్యక్ష, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడి చేసి, నిప్పటించారు.