యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హవీష్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక టాకీ భాగం షూటింగ్ షెడ్యూల్…