Nellore Crime: నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. విక్రయాలకు అడ్డుగా ఉన్నాడంటూ స్థానిక సీపీఎం కార్యకర్త పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో.. వేటాడి వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను అత్యంత కిరాతకంగా కత్తులతో హతమార్చారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.. అయితే, నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు పై కూడా గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పోలీసులు…
నెల్లూరు జిల్లా రాపూరు మండలం తాతిపల్లి వద్ద ఈ నెల 16 న జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేయడాన్ని జీర్ణించుకోలేని మస్తాన్.. షఫీని హత్య చేశాడు. షఫీ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. షఫీ కూతుర్ని తనకి ఇచ్చి వివాహం చెయ్యలేదనే కోపంతో మస్తాన్ హత్య చేసినట్లు తేలింది.